హైదరాబాద్: 28°C
వార్తలు

వర్ధన్నపేటలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

WGL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో వర్ధన్నపేట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఆదివారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి తదితరులు ఉన్నారు.