హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రైనేజీ చెత్త.. దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు

GDWL: గద్వాల మున్సిపల్ 31వ వార్డు నల్లకుంట కాలనీలో డ్రైనేజీలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో దోమలు పెరిగి వ్యాధుల ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీని శుభ్రం చేసి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.