విదేశాంగ మంత్రి జైశంకర్ ఇవాళ్టి నుంచి 15వ తేదీ వరకు ఆరు దేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల 10 వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాలలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరుపుతారు. 13న న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) భారత్ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. చివరగా 14, 15 తేదీల్లో బ్రస్సెల్స్‌లో జరగనున్న భారత్-ఈయూ కీలక సదస్సుకు హాజరుకానున్నారు.
వార్తలు
నేటి నుంచి జైశంకర్ 6 దేశాల పర్యటన


