ASR: ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న SGTలను HWOలుగా బదిలీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమశాఖ డీడీ పీబీకే పరిమళ తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో SGTలుగా పనిచేస్తున్న వారిలో 10శాతం మంది టీచర్లను HWOలుగా బదిలీలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈమేరకు, ఆసక్తి ఉన్న SGTలు ఆదివారం (నేడు)మధ్యాహ్నం 2గంటలకు కార్యాలయంలో హాజరు కావాలన్నారు.
వార్తలు
'నేడు SGTలు హాజరు కావాలి'


