KRNL: కర్నూలులో ప్రజా ప్రశాంతత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు శనివారం డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. జులై 31 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని చెప్పారు. ముందస్తు పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతుల కోసం సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని డీఎస్పీ సూచించారు.
వార్తలు
కర్నూలులో 30 పోలీస్ యాక్ట్ అమలు: డీఎస్పీ


