హైదరాబాద్: 28°C
వార్తలు

23 మందికి ఏఎస్ఐలుగా పదోన్నతి

KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న 23 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన 16 మంది, నంద్యాల జిల్లాకు చెందిన 7 మంది ఉన్నారు. అటు, వీరందరినీ నంద్యాల జిల్లాకు కేటాయించారు.