హైదరాబాద్: 28°C
వార్తలు

తెలంగాణలోని ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. ఈ 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 50-60 కి.మీ. వేగంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.