హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రంప్‌నకు, అమెరికన్లకు మోదీ స్పెషల్ విషెస్

అమెరికా 250వ చారిత్రాత్మక స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌నకు, అక్కడి ప్రజలకు ప్రధాని మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున 'X' వేదికగా మోదీ విషెస్ చెప్పారు. ఇరు దేశాల బంధం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మించిన నిఖార్సైన స్నేహమని కొనియాడారు. రాబోయే 250 ఏళ్లలో భారత్-అమెరికా బంధం కొత్త శిఖరాలను తాకాలని ఆకాంక్షించారు.