ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుమానంతో తనిఖీలు చేయగా, ఆమె వద్ద అక్రమంగా దాచిన 4 కిలోల బంగారం బయటపడింది. దీని విలువ మార్కెట్లో సుమారు రూ.6 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ విభాగం, స్మగ్లింగ్‌కు పాల్పడిన మహిళను అరెస్ట్ చేసి విచారిస్తోంది.
వార్తలు
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టురట్టు


