హైదరాబాద్: 28°C
వార్తలు

మత్తు పదార్ధాల ఏరివేత లక్ష్యంగా తనిఖీలు

VZM: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా అరికట్టడమే లక్ష్యంగా పార్వతీపురం, బొబ్బిలి రైల్వే స్టేషన్ల మధ్య నడిచే విశాఖపట్నం-కోరాపుట్ పాసింజర్ రైల్లో ఈగల్ టీం, జీఆర్పీ సిబ్బంది శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రయాణికుల లగేజీ బ్యాగులను నిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి మత్తు పదార్థాలు లభ్యం కాలేదు.