జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా మెమాందర్ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఉగ్రవాదుల కదలికలపై సమాచారంతో బలగాలు వారు దాక్కున్న ఇంటిని చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఇద్దరు ఉగ్రవాదులు ఆర్మీ ఉచ్చులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతున్న తరుణంలో ఈ కాల్పులు జరగడంతో కశ్మీర్ లోయలో రక్షణ సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి.
వార్తలు
అమర్‌నాథ్ యాత్ర వేళ కలకలం


