హైదరాబాద్: 28°C
వార్తలు

యువతకు కెరీర్ మార్గదర్శనం

తిరుపతిలోని ఎస్‌డీహెచ్‌ఆర్ డిగ్రీ కళాశాలలో శనివారం APSSDC, కౌటిల్య ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా కెరీర్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు, పోటీ పరీక్షల సన్నద్ధత, నైపుణ్యాభివృద్ధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాయలసీమలోని కళాశాలల్లో ఉచిత కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.