NLR: కందుకూరు టౌన్‌లోని 11 కెవి వెంకటాద్రిపాలెం ఫీడర్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఫీడర్ పరిధిలో ఉన్నటువంటి రామానాయుడు నగర్, INR గార్డెన్ ఏరియాలో కరెంటు సరఫరా ఉండదన్నారు.
వార్తలు
రేపు కందుకూరులో పవర్ కట్


