హైదరాబాద్: 28°C
వార్తలు

ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు

KRNL: జిల్లాలో గత ఆరు నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 21,977 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హెల్మెట్ ధరించడం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.