హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం

PLD: రాజుపాలెం మండలం పార్వతీపురం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఆర్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన, వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు వివరించారు. కోట నెమలిపురి, గణపవరం కేంద్రాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.