RR: అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఉషాముళ్ళపూడి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనపై పోరాడి, గిరిజనుల హక్కుల కోసం 27 ఏళ్లకే ప్రాణత్యాగం చేసిన అల్లూరి ఆశయాలు నేటి యువతకు ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.
వార్తలు
ఆల్విన్ కాలనీలో మన్యం వీరుడికి ఘన నివాళి


