SKLM: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఈనెల 6న మందస హరిపురం పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు ఉచిత యాంటీరాబిస్ టీకాలు వేయనున్నట్లు డా. దువ్వాడ శ్రీకాంత్, డా. కిల్లి ఉమాభారతి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జూనోటిక్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వార్తలు
ఉచితంగా యాంటీ రాబిస్ టీకాలు


