కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో ఉండబోదని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు సమాచారం. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణే తమ ప్రథమ ప్రాధాన్యమన్నట్లు కేంద్రం అడుగులు వేస్తోందట. మంత్రులను ఇప్పుడు మారిస్తే కీలక బిల్లుల రూపకల్పన, శాఖలపై పట్టు కోల్పోయే ప్రమాదముండటంతో.. విపక్షాలను ఎదుర్కొనే వ్యూహాలపైనే ప్రధాని మోదీ పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
వార్తలు
కేంద్ర కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే!


