HNK: కాజీపేట మండలం మడికొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులకు నూతన చట్టాలపై శనివారం ఆన్‌లైన్ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. భారతీయ న్యాయ సంహిత–2023లోని కీలక నిబంధనలు, సవరించిన సెక్షన్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏసీపీ రమణబాబు, కొత్త చట్టాల అమలులో పాటించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు.
వార్తలు
నూతన చట్టాలపై పోలీసులకు శిక్షణ


