హైదరాబాద్: 28°C
వార్తలు

12,696 మంది రైతులకు రైతు భరోసా జమ

BHPL: చిట్యాల మండలంలో 5 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను దశలవారీగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు 12,696 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.13.60 కోట్లకుపైగా (రూ.13,60,24,546) జమ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డి శనివారం తెలిపారు. నూతనంగా పట్టా పొందిన అర్హులైన రైతులు త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.