హైదరాబాద్: 28°C
వార్తలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. డేట్ ఫిక్స్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ఉభయసభల సమావేశాలు ఆగస్ట్ 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా, గత పార్లమెంట్ సమావేశాల్లో వీగిపోయిన అత్యంత కీలకమైన నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) బిల్లుతో పాటు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లులను ఈ సమావేశాల్లో కేంద్రం మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.