హైదరాబాద్: 28°C
వార్తలు

TDP పట్టణ ప్రధాన కార్యదర్శిగా సుధీర్

TPT: నాయుడుపేట పట్టణ TDP ప్రధాన కార్యదర్శిగా అవధానం సుధీర్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని సుధీర్ అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.