హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య రామమందిరంలో కొత్త రూల్స్

అయోధ్య రామమందిరంలో కానుకల చోరీ కేసు నేపథ్యంలో శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టెంపుల్ కాంప్లెక్స్‌లో విరాళాలు లెక్కించే సిబ్బందికి కఠిన నిబంధనలు విధించింది. నగదు లెక్కింపు ప్రక్రియలో పాల్గొనేవారు జేబులు ఉన్న దుస్తులు ధరించడం, కౌంటింగ్ రూమ్‌లోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధిస్తూ ప్రకటన చేసింది.