హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాకు భారీ వర్ష సూచన

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రానున్న 24గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న ముసురు వర్షం భారీ వర్షసూచనగా మారే అవకాశం ఉందని తెలిపింది. కాగా, భారీ వర్షాల కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రైతన్నలు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.