హైదరాబాద్: 28°C
వార్తలు

9 నుంచి శ్రీనివాస బ్రహ్మోత్సవాలు

MLG: జంగాలపల్లిలోని శ్రీ శ్రీనివాస స్వామి దేవాలయంలో జూలై 9 నుంచి 11 వరకు చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ శనివారం తెలిపింది. చివరి రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు.