ADB: ప్రభుత్వం గ్రామాల్లో అందజేసే వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డా. కృష్ణవేణి పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపాలగూడ గ్రామంలో శనివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
వార్తలు
'వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి'


