JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం వర్షం కురవడంతో భక్తులు ఆలస్యంగానైనా కొండకు చేరుకొని, తలనీలాలు సమర్పించుకొని, కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, బేతాళ, రామాలయాలు భక్తులతో రద్దీగా మారింది. అర్చకులు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు
VIDEO: అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ


