హైదరాబాద్: 28°C
వార్తలు

తాడిపత్రి రూరల్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

ATP: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వై. విజయ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.