హైదరాబాద్: 28°C
వార్తలు

'అల్లూరి త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి'

WGL: అల్లూరి సీతారామరాజు త్యాగస్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని పర్వతగిరి మండల సర్పంచ్ చీదురు శంకర్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. అనంతరం వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకుల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.