హైదరాబాద్: 28°C
వార్తలు

రాజధానిపై YCPది రోజుకో మాట: సంధ్యారాణి

AP: రాజధాని అమరావతిపై YCP నేతలు రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. తమ వ్యాఖ్యలతో ప్రజల్లో అల్లకల్లోలం తేవాలనే ఆలోచనతో YCP ముందుకెళ్తోందన్నారు. మూడు రాజధానులు, విజయవాడ, మావిగన్ అంటూ జగన్ సృష్టిస్తున్న అలజడికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. హోంమంత్రి అనితపై YCP నేత అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.