హైదరాబాద్: 28°C
వార్తలు

రోజూ రూ.6-8 లక్షలు మాయం?

అయోధ్య విరాళాల కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజుకు రూ.6 నుంచి రూ.8 లక్షల వరకు నగదు పక్కదారి పట్టినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసు బయటకు రాక ముందు రోజూ రామ తీర్థ్ ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.16 నుంచి రూ. 18 లక్షల వరకు నగదు జమయ్యేదని అధికారులు తెలిపారు. అదే చోరీ బయటపడిన తర్వాత రోజుకు రూ.24 లక్షల నుంచి రూ.26 లక్షలకు పెరిగినట్లు చెప్పారు.