NTR: దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా విజయవాడ త్రిమూర్తి చౌక్ లోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. రోశయ్య రాజకీయాల్లో నీతి, నిజాయితీ, ఆర్థిక క్రమశిక్షణకు ఆదర్శంగా నిలిచారని వెలంపల్లి కొనియాడారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు, కొనకళ్ల విద్యాధరరావు, తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
నిజాయితీలకు ఆదర్శం రోశయ్య: మాజీ మంత్రి


