హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా వంగవీటి మోహన రంగ జయంతి

అన్నమయ్య: కోడూరులో వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. శివాలయం ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వద్ద మోహనరంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని మోహన రంగా సేవలను స్మరించుకున్నారు.