హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: రోడ్డుపైనే చెత్త.. వాహనదారుల ఇబ్బందులు

ELR: చింతలపూడి మండలం ప్రగడవరం ప్రధాన రహదారి మార్జిన్‌పై పంచాయతీ సిబ్బంది చెత్తను గుట్టలుగా వేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు ఇరుకుగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండగా, పేరుకుపోయిన చెత్త నుంచి వస్తున్న దుర్వాసనతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు దీనిపై స్పందించాలన్నారు.