RR: స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా, చేవెళ్ల పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి చేవెళ్ల మున్సిపల్ ఛైర్‌పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లేచి నిలబడండి, మేల్కొనండి లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి అనే స్వామి వివేకానంద సందేశం నేటి యువతకు, ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
స్వామి వివేకనందకు ఘన నివాళి


