హైదరాబాద్: 28°C
వార్తలు

అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: మంత్రి

సత్యసాయి: గోరంట్లలో టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి శనివారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్య్రం సమరంలో అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలు, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.