హైదరాబాద్: 28°C
వార్తలు

ఆసుపత్రిలో చేరిన డిప్యూటీ సీఎం

అనారోగ్య సమస్యలతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే థానేలోని ఓ ఆసుపత్రిలో చేరారు. నిన్నటి నుంచి ఆయన స్వల్ప జ్వరం, నీరసం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరారని.. ప్రస్తుతం ఆయనకు సాధారణ ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాయి.