హైదరాబాద్: 28°C
వార్తలు

బండ్ల గణేష్ ఆస్తుల వేలానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

HYD: నిర్మాత బండ్ల గణేష్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ పేరిట తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన ఆస్తిని రూ.8.50 కోట్లకు వేలం వేసిన చర్యను హైకోర్టు సమర్థించింది. బండ్ల గణేష్‌కు అనుకూలంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.