పాక్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన 23 మందిని ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. వీరంతా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సాయం చేస్తున్నట్లు చెప్పింది. వారు ఉగ్రవాద సంస్ధల కోసం నిధుల సమీకరణ, డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా, యువతను తప్పుదోవ పట్టించడం వంటి చర్యలకు పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.
వార్తలు
23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం


