హైదరాబాద్: 28°C
వార్తలు

లై డిటెక్టర్‌కు సియా, చేతన్‌ 'నో'

రియాల్టర్ కేతన్ హత్య కేసులో నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితులైన సియా, చేతన్‌లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. వారు టెస్ట్‌కు సమ్మతించకపోవడంతో నిజనిర్థరణ పరీక్షకు న్యాయస్థానం అంగీకరించలేదు. అయితే నిందితులను మరో 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పునిచ్చింది.