హైదరాబాద్: 28°C
వార్తలు

బీహార్ ప్రభుత్వం యూటర్న్

మాజీ సీఎంలు లాలూ ప్రసాద్, రబ్రీ దేవీ భద్రత విషయంలో బీహార్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఇటీవల వారికి తగ్గించిన భద్రతను తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు Z కేటగిరీ భద్రతతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అందించింది. రబ్రీ దేవీని ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన తర్వాత భద్రతను కుదించింది. మిగిలిన భద్రతను కూడా లాలూ వెనక్కి పంపించడంతో సర్కార్ మళ్లీ పెంచింది.