హైదరాబాద్: 28°C
వార్తలు

SIRలో శ్రీకాళహస్తి, సత్యవేడు వంద శాతం పూర్తి!

తిరుపతి జిల్లా ఓటర్ల జాబితా సవరణలో శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు వంద శాతం ఫారాల పంపిణీతో అగ్రస్థానంలో నిలిచాయి. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లకు గాను 17.64 లక్షల మందికి ఫారాల పంపిణీ జరగ్గా, చంద్రగిరిలో అత్యల్పంగా 98.74 శాతం పంపిణీ నమోదైంది. ఇక ఆన్‌లైన్ డిజిటలైజేషన్ ప్రక్రియలో సుళ్లూరుపేట 50.88 శాతంతో ముందంజలో ఉంది.