లాకప్ డెత్ కేసులో మహారాష్ట్ర వాషిమ్ జిల్లా, సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 15 ఏళ్ల క్రితం 23 ఏళ్ల యువకుడి లాకప్ డెత్‌కు కారణమైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా 9 మంది పోలీసులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. బేగ్యా పవార్ అనే వ్యక్తిని విచారణ నిమిత్తం పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఆ మరుసటి రోజే పవార్ కస్టడిలోనే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు.
వార్తలు
లాకప్ డెత్.. కోర్టు సంచలన తీర్పు


