హైదరాబాద్: 28°C
వార్తలు

ఓయూ పరిధిలో భారీగా ఛార్జీల పెంపు

HYD: ఉస్మానియా యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరం నుంచి పలు అకడమిక్ సేవల ఛార్జీలను 20% నుంచి 100% వరకు పెంచింది. ఈక్వివలెన్సీ, ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు, కాండోనేషన్ తదితర సేవలకు విద్యార్థులు ఇకపై అధిక మొత్తాలు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా యూజీ, పీజీ కాండోన్ ఫీజును రూ. 500- రూ.1,000కు పెంచడంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.