హైదరాబాద్: 28°C
వార్తలు

జూరాల ప్రాజెక్టుకు పూర్తిగా నిలిచిన ఇన్‌ఫ్లో

WNP: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. శనివారం నాటికి డ్యామ్ నీటిమట్టం 316.52 మీటర్లుగా (5.973 టీఎంసీలు) నమోదు కాగా, ప్రాజెక్టు లైవ్ స్టోరేజీ 2.266 టీఎంసీలుగా ఉంది. తాగునీరు ఇతర అవసరాల కోసం మొత్తం 706 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.