హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యర్థాల నుంచి హైడ్రోజన్.. JNTUH శాస్త్రవేత్తల వినూత్న ప్రయోగం

HYD: వృథా జలాలు, పండ్లు, కూరగాయల వ్యర్థాలతో మీథేన్ రహిత హైడ్రోజన్ ఇంధనాన్ని అభివృద్ధి చేసే దిశగా JNTU హైదరాబాద్ ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు ప్రయోగాలు చేపట్టారు. వంటగ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే ఈ సాంకేతికతతో మీథేన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పరిశోధన ప్రయోగ దశలో కొనసాగుతోంది.