హైదరాబాద్: 28°C
వార్తలు

ఐఐటీల్లో వేధిస్తోన్న అధ్యాపకుల కొరత

దేశంలోని పలు ఐఐటీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. 23 ఐఐటీల్లో దాదాపు 4,804 పోస్టులు ఖాళీ పోస్టులు దర్శనమిస్తున్నాయి. ప్రతి ఐదు అధ్యాపక పోస్టులల్లో రెండు ఖాళీగా ఉన్నాయని జాతీయ మీడియా తెలిపింది. ముఖ్యంగా ఐఐటీ పాట్నాలో 54.6 శాతం, ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 51.3 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. 2028-29 నాటికి మరో 6500 సీట్లు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.