MDCL: ఉప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్‌కు చెందిన భరత్‌కు వచ్చిన ఓ లింక్‌ను నమ్మి క్లిక్ చేయడంతో సైబర్ మోసగాళ్లు ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.8,965 కాజేశారు. డబ్బు మాయమైన విషయం తెలుసుకున్న బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెలియని లింక్‌లు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
వార్తలు
సైబర్ వలలో ఉప్పల్ వాసి


