హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకులంలో ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

అన్నమయ్య: సంబేపల్లి మండల పరిధిలోని దేవపట్ల మిట్టలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 5వ తరగతి వరకు వివిధ కేటగిరీలలో మొత్తం 151 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు విద్యాలయాన్ని సంప్రదించాలన్నారు.