హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మామునూరు వద్ద మళ్లీ ప్రమాదం..!

Advertisement

WGL: పట్టణంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై మామునూరు సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక డివైడర్ మరోసారి ప్రమాదానికి కారణమైంది. శుక్రవారం ఖమ్మం వైపు వెళ్తున్న ట్రాలీ లారీ డివైడర్‌ను గుర్తించక ఢీకొనడంతో వాహనం ముందు చక్రాలు దెబ్బతిన్నాయి. ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Advertisement